జడేజా కి పెళ్లి కి ముందే ఆడీ కారు గిఫ్ట్

Audi Q7 car gift for Jadeja

10:54 AM ON 6th April, 2016 By Mirchi Vilas

Audi Q7 car gift for Jadeja

చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. ఇప్పుడు టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా పెళ్ళికి ముందే అత్తింటి నుంచి భారీ కానుక కొట్టేసాడు. జడేజా ఓ ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌కు చెందిన హర్దేవ్‌సింహ్‌ దంపతుల ఏకైక కుమార్తె రివాబా సోలంకీతో రవీంద్ర జడేజాకు ఇటీవలే నిశ్చితార్థం జరగగా, ఇక ఈ నెల 17న వీరిద్దరి వివాహం జరగనుంది. జడేజా స్వగ్రామంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 16న జడేజా తన క్రికెట్‌ మిత్రులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నాడట.

అయితే పెళ్లికి ముందే కాబోయే అల్లుడికి జడేజా అత్తింటివారు భారీ బహుమతినే ఇచ్చారు. అదేనండీ రూ. 97 లక్షల విలువ చేసే ఆడీ క్యూ 7 కారును జడేజా మామ హర్దేవ్‌సింహ్‌ సోలంకీ కాబోయే అల్లుడికి కానుకగా అందించారు. జడేజా తన కాబోయే భార్యతో కలిసి వెళ్లి స్థానిక షోరూం నుంచి కారు తెచ్చుకున్నారు.

English summary

Audi Q7 car gift for Jadeja. Audi Q 7 car gift for Ravindra Jadeja from Bride's father.