మొదలైన ఆడియో సీజన్‌  

Audio Functions In December

10:40 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Audio Functions In December

డిసెంబర్ నెల అంతా ఆడియో ఫంక్షన్ లతో మురుమోగనుంది . క్రిస్మస్‌, సంక్రాంతి, నూతన సంవత్సరం సందర్భంగా అనేక చిత్రాలు విడుదలవ్వనున్నాయి. ఆ సినిమాల తాలుకు ఆడియో వేడుక ఇంకా మొదల కాకపోవడంతో నెలలో ఆడియోను రీలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇటివలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించిన లోఫర్‌ చిత్రం ఆడియో విడుదల కాగా, రామ్‌ నటించిన 'నేను-శైలజ'', చిత్రం ఆడియో ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత రోజు 13 న గోపిచంద్‌ నటించిన ''సౌఖ్యం'' సినిమా ఆడియో వేడుక ఒంగోలు లో జరగనుంది , మరో సినిమా బాలయ్య ''డిక్టేటర్‌'' కూడా డిసెంబర్‌ 20 న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో విడుదల కానుంది. ఇక అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ తాజా చిత్రం ''నాన్నకు ప్రేమతో '' సినిమా ఆడియో కుడా ఈ నెల 23 న కాని 25న విడుదల చెయ్యనున్నారు. ఇలా ఆ సీజన్‌ మొత్తం ఆడియో ఫంక్షన్‌తో మారుమోగనుంది.

English summary

December season is the audio season for tollywood. Audio functions of various movies were going to release today