తెలుగోడికి ఆస్ట్రేలియా అత్యున్నత పౌరపురస్కారం

Australia Presents Awards To Indians

12:50 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Australia Presents Awards To Indians

భారతీయలు ఏదేశం లో వున్నా,తమ ప్రతిభా పాటవాలతో రాణిస్తుంటారు. గౌరవాలు , పురస్కారాలు సొంతం చేసుకుంటారు. అందునా తెలుగువాళ్ళు అయితే ఇక చెప్పక్కర్లేదు. తాజాగా ఓ తెలుగు వాడికి ఆస్ట్రేలియా అత్యున్నత పౌరపురస్కారం లభించింది. ఆస్ట్రేలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని భౌతికశాస్త్రంలో అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గాను ఆ దేశం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ అవార్డును భారత సంతతికి చెందిన కృష్ణా జిల్లా వాసి చెన్నుపాటి జగదీశ్‌కు అందించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనతో పాటు భారత సంతతికి చెందిన ఇద్దరు మేధావులకు కూడా అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి. భౌతిక శాస్త్రం, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి. న్యూసౌత్‌వేల్స్‌లో ప్రముఖ నేత్రవైద్యుడు జయచంద్ర, మెల్‌బోర్న్‌లో దంతవైద్యుడు సజీవ్‌ కోషెలు 2016 గాను ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా అవార్డులను అందుకున్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలందించిన 600 మందికి ఆస్ట్రేలియా ఈ ఏడాది పౌరపురస్కారాలు అందజేసింది.

చెన్నుపాటి జగదీశ్‌ 1977లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో బీఎస్సీ చదివారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. దిల్లీ, కెనడాలలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1990లో ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. సెమీ కండక్టర్‌ ఆప్టో ఎలక్ట్రానిక్స్‌, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు చేస్తూ అత్యున్నత సేవలందిస్తున్నారు.

English summary

Australian government awarded three Indians with Australia's Prestigious Awards.A man from Krishna District from Andhra Pradesh Named Chennupaati Jagadeesh got "Order Of Austrailia " Award