ఆసీస్, విండీస్ మూడో టెస్టు వర్షం అడ్డంకి

Australia vs West Indies Test Match

06:41 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Australia vs West Indies Test Match

సిడ్నీలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టును వరుణుడు వీడలేదు. మూడో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. వర్షం కారణంగా రెండో రోజైన సోమవారం కేవలం 11.2 ఓవర్లు మాత్రమే మ్యాచ్‌ జరిగింది. అంతకుముందు ఆట ప్రారంభమైన తొలి రోజు కూడా వర్షం అంతరాయం కలిగించింది. నాలుగో రోజు కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. రాందిన్‌(30), రోచ్‌(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

English summary

Rain stopped play to 11.2 overs on the second day of the third Test at the Sydney Cricket Ground as the West Indies progressed to 248 for 7 at stumps on Day 2 against Australia.