ఇలాంటి తెలివైన స్టంప్ ఎప్పుడైనా చూసారా(వీడియో)

Australia wicket keeper brilliant stumpout

12:04 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Australia wicket keeper brilliant stumpout

క్రికెట్ లో చాలా ఫన్నీ మూమెంట్స్, ఇంకొన్ని అద్భుతాలు చూసి ఉంటారు. అయితే ఇది మాత్రం చాలా భిన్నం. బ్యాట్స్ మెన్ క్రీజ్ లోనే వున్నాడు. కానీ స్టంప్ ఔట్ అయ్యాడు. అదెలాంటే.. కోలంబో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఈ వింత స్టంప్ అవుట్ జరిగింది. ఈ టెస్టులో నాలుగో రోజు శ్రీలంక ఓపెనర్ కరుణరత్నె స్టంపౌట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో బంతిని డిఫెన్స్ చేసేందుకు కరుణరత్నె ప్రయత్నించాడు. కానీ బంతి అతను వూహించని రీతిలో టర్న్ తీసుకుని వికెట్ కీపర్ పీటర్ నెవిల్ చేతుల్లోకి వెళ్లింది.

దీంతో ఆ బంతిని ఎలా ఆడుండాల్సిందో ఓసారి రిహార్సల్స్ లా ప్రయత్నించాడు. అయితే ఎవ్వారు ఉహించని విధంగా కీపర్ నెవిల్ వికెట్లను తాకి అవుట్ కోసం అప్లై చేశాడు. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. తీరా థర్డ్ అంపైర్ నిర్ణయం అవుట్ అని తేలింది. ఈ వీడియో చూస్తే ఆ వికెట్ కీపర్ యొక్క ప్రెజన్స్ అఫ్ మైండ్, బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యమైన ఫుట్ వర్క్ రెండూ అర్ధమౌతాయి.

English summary

Australia wicket keeper brilliant stumpout