తొలి టెస్టులో విండీస్‌పై ఆస్ట్రేలియా విక్టరీ

Australia Wins Over Westindies

06:17 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Australia Wins Over Westindies

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 583 పరుగులు చేయగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 223 రన్స్‌కు ఆలౌట్ అయింది. తర్వాత ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 148 రన్స్ మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఐదు రోజుల టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆడమ్ వోగ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాటిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే 5 వికెట్లు కూల్చి విండీస్‌ వెన్ను విరిచాడు. హాజల్‌ ఉడ్‌ రెండు ఇన్నింగ్స్ ల్లోను అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 45 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్ లో 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.

English summary

Australia wins over west indies in first test. The test was completed just in three days after dismissing the west indies for 148 in the second innings