మూడు టెస్టుల సిరీస్ ఆసీస్ దే..

Australia wins Test Series Against West Indies

04:41 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Australia wins Test Series Against West Indies

వెస్టిండీస్ తో మూడు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బాక్సింగ్ డే సందర్భంగా జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది ఆసీస్. 460 పరుగుల విజయ లక్ష్యంతో మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 282 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఆటగాళ్లలో రామ్ దిన్(59), జాసన్ హోల్డర్(68) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఘోర పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించగా, నాథన్ లయన్ కు మూడు, పాటిన్సన్ కు రెండు, పీటర్ సిడెల్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్ నైట్ స్కోరు 179/3 వద్దే రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఓవరాల్ గా 459 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆదిలో కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తరువాత 118 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రామ్ దిన్ -హోల్డర్ లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించే యత్నం చేశారు. కాగా, వీరిద్దరూ అవుటైన తరువాత విండీస్ కథ మళ్లీ మొదటకొచ్చింది. విండీస్ తన చివరి నాలుగు వికెట్లను 32 పరుగులకే కోల్పోయింది. దీంతో ఆసీస్ 179 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది.

English summary

Australia wins Test Series Against West Indies