ఆసీస్‌తో వన్డేలో భారత మహిళా టీమ్ ఓటమి

Australia Women Team Won Against India

11:07 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Australia Women Team Won Against India

ఆస్ట్రేలియా-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌ 1-0తో సిరీస్‌లో పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ 114, ఎల్ల్సీ పెర్రీ 90 పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో శిఖాపాండే మూడు వికెట్లు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 46.5 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. హర్మన్‌ప్రీత్‌(46), జూలన్‌ గోస్వామి(25) మాత్రమే రెండండెల స్కోర్‌ చేశారు. అంతకు ముందు నిర్వహించిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

English summary

Recently Indian woman cricket team won series against Australian Woman team and now in One Day matches Australian woman team beats Indian Woman team by 101 Runs in !st ODI and lead the series 1-0