కివీస్ తో తొలి టెస్టులో ఆసీస్‌ గ్రాండ్ విక్టరీ

Australia won 1st test Against New Zealand

11:07 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Australia won 1st test Against New Zealand

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా 52 పరుగుల తేడాతో ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీ, ఆడమ్‌ వోగ్స్‌ డబుల్‌ సెంచరీ సాధించడంతో 562 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్ 379 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన న్యూజిలాండ్‌ 327 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో ఆసీస్‌ 52 పరుగుల ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. 239 పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడమ్‌ వోగ్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా, వందో టెస్టు ఆడిన కివీస్‌ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తొలి ఇన్సింగ్స్‌లో డకౌట్‌, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు.

English summary

Steve Smith and Usman Khawaja hammered home the advantage their bowlers had established when they took Australia to 147 for 3, a deficit of just 36 runs, at the close of the opening day's play in the first Test against New Zealand on Friday.