క్రికెటర్లపై ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం మెక్ గ్రాత్ షాకింగ్ కామెంట్స్

Australian Bowling Legend McGrath Shocking Comments On Cricketers

10:52 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Australian Bowling Legend McGrath Shocking Comments On Cricketers

క్రికెట్ పై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మెక్ గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీసీఏ స్టేడియంలో ప్రారంభించిన అండర్-23 పేసర్ కోచింగ్ క్లినిక్ లో పాల్గొన్న ఈ మాజీ బౌలింగ్ దిగ్గజం మాట్లాడుతూ యువ క్రికెట్లు చాలా కష్టపడాలని, ఓ పేరు వచ్చాక దానిని కాపాడుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. ఈజీ ఆప్షన్లకు షార్ట్ కట్స్ ఉండవన్నాడు. యువ క్రికెటర్లు మంచి నైపుణ్యంతో పేరు గాంచిన సందర్భాలను తాను చూశానని, వారి ప్రతిభకు బాగా డబ్బు అందుతున్న తర్వాత కష్టపడడాన్ని ఆపేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే విషయంలో డబ్బుది మొదటి పాత్ర కాకుండా ఉండాలని అన్నాడు. గొప్ప క్రికెటర్లు అందరూ బాగా డబ్బు సంపాదిస్తున్నారని, అయితే దాని స్థానం క్రికెట్ తర్వాతే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. క్రికెటర్ల లక్ష్యం ఎప్పుడూ దేశానికి ప్రాతినిథ్యం వహించడంపైనే ఉండాలని మెక్ గ్రాత్ వివరించాడు. అన్నీ బానే వున్నాయి కదా అనుకుంటున్నారా అసలు ఇక్కడే వుంది అసలు కథ.

ఈజీ మనీ క్రికెటర్లను నాశనం చేస్తోందని ఈ క్రికెట్ మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చ నీయాంశం అయింది. టీ20 తెరపైకి వచ్చిన తర్వాత ఇది మరింత వేగంగా జరుగుతోందన్నాడు. ఫాస్ట్ బౌలర్లను టి20లు వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక్క భారత్ కే పరిమితం కాలేదని, ప్రపంచమంతా ఇది విస్తరించిందని విశ్లేషించాడు. టి20లతో క్రికెటర్లకు సులభంగా డబ్బు లభిస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ వంటి వాటి ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్న క్రికెటర్లు ఇప్పటికే చాలా చేశామని అనుకుంటున్నారు. దీంతో శిక్షణ ఆపేస్తున్నారు అని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:సింధుకు కోచ్ గా గోపీచంద్ తొలగింపు!

ఇవి కూడా చదవండి:ఒలంపిక్స్ లో చచ్చిపోయేదాన్ని .. అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు

English summary

Former Australian fast bowling legend Glen McGrath made some shocking comments on Cricketers. Mc Grath said that T20 have been spoiled upcoming cricketers. He said that money should be secondary and Cricket should be their primary goal.