ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లకు కోటి రుపాయలు ఫైన్

Australian Court Fines 1 crore for defamatory Facebook post

11:07 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Australian Court Fines 1 crore for defamatory Facebook post

అవునా అని ఆశ్చర్య పోకండి. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టేస్తే, ఊరుకునే రోజులు కావివి. అందుకే ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లు చేసిన వ్యక్తికి ఓ కోర్టు కోటి రుపాయాల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియాకు చెందిన 74 ఏళ్ళ రోథీకి రెండు హోటళ్ళున్నాయి. కుటుంబ గొడవలతో ఇంటి నుంచి వెళ్ళిపోయిన పిల్లలకు తన హోటళ్ళలో ఆశ్రయం కల్పించేవాడు. అయితే డేవిడ్ స్కాట్ అనే ఎలక్ట్రీషియన్ 2014లో ఫేస్ బుక్ లో ఈ హోటళ్ళపై అసభ్యకర కామెంట్లు చేశాడు. చిన్నారులతో రహస్య వ్యభిచారం జరుగుతోందని పోస్ట్ చేశాడు. దీంతో సెక్స్ కోసమంటూ ఆ హోటళ్ళకు ఫోన్లు రావడంతో రోథీ అసలు విషయం తెలుకున్నాడు.

దీనిపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని స్కాట్ ను రోథీ కోరాడు. అయితే అతడికి బెదిరింపులు రావడంతోపాటు కొందరు దారుణంగా కొట్టారు. దీంతో రోథీ ఆరు నెలల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. జరిగిన దానిపై రోథీ కోర్టును ఆశ్రయించగా, జిల్లా కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఫేస్ బుక్ లో అసభ్య పోస్ట్ లతో హోటల్ ఓనర్ పరువునకు నష్టం కలిగించినందుకు డేవిడ్ స్కాట్ కు లక్ష 50 వేల డాలర్ల ఫైన్ అంటే కోటి రూపాయల జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి:స్వర్గ వాసులను అలరించడానికి 'జ్యోతి లక్ష్మి' వెళ్ళిపోయింది

ఇవి కూడా చదవండి:ప్రపంచం అంతమై పోతుందా? (వీడియో)

English summary

Australian Court Fined a man named Rodhi with 1 crore fine for defamatory Facebook post. He was fined for beating the hotel owner also.