సేల్ఫీతో ప్రైజ్ మనీ హుష్ కాకి

Australian Girl Losses His Prize Money With A Selfie

06:57 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Australian Girl Losses His Prize Money With A Selfie

చంటేల్లె అనే యువతి గుర్రపు పందెంలో ఆమె గెలుచుకున్న ప్రైజ్ మనీ కోల్పోయిన ఘటన ఆస్ట్రేలియా లోని పెర్త్ లో జరిగింది. ఆమె స్థానిక గుర్రపు పందెంలో 825డాలర్ల గెలుచుకున్న ఆనందంలో ప్రైజ్ మనీ గెలుచుకున్న టికెట్ బార్ కోడ్ కనిపించేటట్లుగా ఉన్న ఒక సేల్ఫీను ఫేస్ బుక్ పెట్టింది. దీనిని గమనించిన ఆమె ఫేస్బుక్ స్నేహితుల్లో ఒకరు ఆ ప్రైజ్ మనీని టికెట్ బార్ కోడ్ ను ఫోర్జరీ తరహాలో వినియోగించి కాజేసాడు.సేల్ఫీలో చంటేల్లె చూపిన బార్ కోడ్ ను ఆన్ లైన్లో అప్లై చెయ్యడంతో సదరు నిర్వాహకులు 825 డాలర్ల సొమ్మును అపరిచితుడికి ఖాతాకు జమ చేసారు. ఈ విషయం తెలియక చంటేల్లె తన టికెట్ బార్ కోడ్ తో అప్లై చెయ్యగా అప్పటికి మరొకరికి తన ప్రైజ్ మనీ చెల్లించేసారాన్న విషయం తెలిసింది.దీనితో లబోదిబో మనడం ఆమె వంతు అయింది.

English summary

A woman named Chantelle from Perth, Australia, was so pumped at winning a bet on the Melbourne Cup horse race that she shared her excitement on Facebook.She Looses Her Prize Money.