ఆసీస్ మహిళా క్రికెటర్‌ పై నిషేధం

Australian women cricketer banned

10:51 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Australian women cricketer banned

బెట్టింగ్ కు పాల్పడిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ పై ఆరు నెలల నిషేధం పడింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య గతేడాది నవంబర్లో జరిగిన టెస్టు మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ 19 ఏళ్ల క్లీరీ బెట్టింగ్‌కు పాల్పడింది. మహిళల బిగ్‌బాష్‌ టీ20 టోర్నీలో పెర్త్‌ స్క్రాచర్స్‌ జట్టుకు క్లీరీ ప్రాతినిథ్యం వహిస్తోంది. గతేడాది పురుషుల ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌కు పాల్పడిన మహిళా క్రికెటర్‌ ఏంజెలా రీక్స్‌పై.. ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు డిసెంబర్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బెట్టింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠినంగా వ్యవహరిస్తామంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మరోసారి హెచ్చరించింది.

English summary

Australia cricket board has banned Australia women's cricketer Piepa Cleary for six months, with another 18 months suspended, for placing bets on a men's Test match between Australia and New Zealand in November.