అయుత చండీ యాగానికి శ్రీకారం 

Autha Chandiyagam By KCR Started Today

02:00 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Autha Chandiyagam By KCR Started Today

మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణా సిఎమ్ కెసిఆర్ దంపతులు అయుత చండీయాగం చేపట్టారు. బుధవారం ఉదయం ప్రారంభమైన యాగం 27వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలిరోజు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు స్వాగతం పల్కారు. సంప్రదాయ దుస్తుల్లో యాగశాలకు చేరుకున్న గవర్నర్ దంపతులకు సిఎమ్ కెసిఆర్ దంపతులు స్వాగతం పలికారు.

మొత్తం 40 ఎకరాల్లో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఏకంగా 3 ఎకరాలు కేవలం యాగశాల కోసం కేటాయించి, 108 హోమ గుండాలు సంప్రదాయ బద్ధంగా ఏర్పాటుచేసి, ఏకోత్తర వృద్ధి విధానంలో ఈ మహా క్రతువును సాగిస్తున్నారు. శృంగేరీ పీఠ సంప్రదాయంలో నిర్వహించే చండీ యాగంలో భాగంగా చేస్తున్న కుంకుమ పూజలకోసం శృంగేరి నుంచి కుంకుమ రప్పించారు.

2011 ఏప్రిల్ లో కర్ణాటకలోని శృంగేరీలో అయుత చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత ఏకోత్తర వృద్ధి విధానంలో ఎర్రవల్లిలో సాగిస్తున్నారని చెబుతున్నారు. శృంగేరీ బయట చేస్తున్న అయుత చండీ ఇదే మొదటి దని అంటున్నారు. ఈ మహా క్రతువులో 1100 మంది రుత్వికులు.. ఏక కంఠంతో సప్తశతీపారాయణం చేస్తారు. ఐదు రాష్ట్రాల నుంచి 2000 మంది రుత్వికులు పాల్గొన్నారు.

ఈ యాగం కోసం 30 టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు) మోదుగ సమిధలు సిద్ధం చేసి, 4వేల కిలోల ఆవునెయ్యి వాడుతున్నారు. రోజూ వెయ్యి కమలాలతో హోమం చేస్తారు. ఇక 12 టన్నుల పాయసం రోజూ సిద్ధం చేస్తారు. రోజువారీగా ప్రసాదాల కోసం ఇప్పటికి 3 లక్షల లడ్డూలు తయారు చేశారు. రోజూ 50 వేల మందికి భోజనాలు వడ్డించనున్నారు.

చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18 పురాణాలు రాసి.. ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల గొప్పతనాన్ని వివరిస్తూ అవసరం వచ్చినప్పుడు వారిని కీర్తించారు. మార్కండేయ పురాణంలో చండీ స్తోత్రం వుంది. ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. మిగిలిన స్తోత్రాల కంటే ఇది చాలా విశేష మైందని అంటున్నారు. మిగిలిన స్తోత్రాల్ని పఠించి.. అనుష్టానం చేస్తే ఫలితం వస్తుంది. కానీ.. చండీ స్తోత్రాన్ని వింటేనే ఫలితం వస్తుందన్నది నమ్మకం. చండీ విధానంలో నవచండీ.. శత చండీ.. సహస్ర చండీ.. లక్ష చండీ.. కోటి చండీలు ఉన్నాయి. మన దేశంలో లక్ష చండీలు చేశారు.

అయుత చందీయాగంలో పలువురు పీఠాది పతులు, ప్రముఖులు పాల్గొంటారు. బసకోసం సంప్రదాయంగా కుటీరాలు కూడా సిద్ధం చేయడం విశేషం.

English summary

Ayutha Chandi Yagam Which was conducting by telangana state cheif minister KCR was started in a grand way today. Governer Narasimhan and his wife attended to this Event today