హృతిక్,కొరటాలకు  శ్రీమంతుడి  దెబ్బ

Author Files A Complaint On Srimanthudu team

10:45 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Author Files A Complaint On Srimanthudu team

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సూపర్‌హిట్ సాధించి పలు రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా విడుదలై..ఆరు నెలలు గడుస్తున్న సమయంలో ‘శ్రీమంతుడు’ కథ తనదే అంటూ శరత్ చంద్ర అనే రచయిత కోర్టులో పిటిషన్ వేశారు. తాను రాసిన నవలను ఓ ప్రముఖ మాస పత్రిలో కూడా ప్రచురించారని చెప్పాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో తన నవలను కాపీ చేశారంటూ శరత్ కోర్టును ఆశ్రయించారు. కేసును గురువారం సిటీ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి సింగారెడ్డి విచారించారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ నిర్మాతలు నవీన్ ఎర్నేనేనిలతో పాటు హృతిక్ రోషన్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఇందులో హృతిక్ ప్రమేయం ఏమిటని అనుకుంటున్నారా? ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకూ వేరే భాషల్లో ఈ సినిమా నిర్మించకుండా చూడాలని శరత్ చంద్ర కోర్టును స్టే కోరారు. దీనిపై కోర్టు నోటీసులు జారీచేస్తూ, విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. మొత్తానికి 'దొంగోడొచ్చిన ఆరు మాసాలకు ...' అనే సామెతకు అనుగుణంగా ఇప్పుడు ఈ వ్యవహారం నడుస్తోంది.

English summary