కోటిన్నర తెచ్చిన జంక్‌మెయిల్‌...

Author Gets One Crore Fifty Lakhs By Checking Spam Message

12:10 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Author Gets One Crore Fifty Lakhs By Checking Spam Message

మనం ఈమెయిల్ వాడుతూ ఉంటాం కదా.. ప్రతి రోజు మనకు స్పామ్ బాక్స్ ఎన్నో మెయిళ్లు వస్తూ ఉంటాయి కదా. కానీ మనం వాటిని అంత సీరియస్ గా తీసుకోం. పైగా వాటిని ఒకేసారి డెలిట్ చేసేస్తుంటాం. అయితే ఇకపై స్పామ్ మేసేజ్ లను కూడా ఖచ్చితంగా చూడండి. లేకపోతే మీరు మంచి ఆఫర్ మిస్ కావచ్చు. వాటిల్లో ఎంతో విలువైన సమాచారం కోల్పోవచ్చు. ఇదే మాట చెపుతోంది ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హెలెన్‌ గార్నర్‌. స్పామ్‌ మెసేజ్ వచ్చిందని డిలీట్‌ చేసి ఉంటే.. తాను రూ.కోటి కోల్పోయేదాన్నని చెబుతోంది. అమెరికాలోని యేల్‌ వర్సిటీ.. తొమ్మిది మంది సాహితీవేత్తలకు వింఢమ్‌ షాంప్‌బెల్‌ పేరుతో పురస్కారాలు ప్రకటించింది. ఇందులో గార్నర్‌ పేరు కూడా ఉంది. ఒక్కొక్కరికి సుమారు రూ.కోటి 48 వేలు బహుమతి ఇస్తారు. మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి అంటూ గార్నెల్‌కు వర్సిటీ అధికారులు పంపిన మెయిల్‌ స్పామ్‌లోకి వెళ్లిపోయింది. స్పామ్‌ కదా అని దానిని డెలీట్‌ చేయకుండా చూసి ఆశ్చర్యపోయిందట హెలెన్‌. వర్సిటీని సంప్రదించి తన వివరాలు ఇచ్చిందట. దీంతో వారు ఆమెకు ఆ మొత్తం అందజేశారు. ఇకపై స్పామ్‌లోకి వచ్చిన మెయిళ్లను కూడా ఓసారి చెక్ చేసుకోండి. లేకకుంటే ఇలాంటి బహుమతులు మిస్ కావాల్సి రావచ్చు.

English summary

A female Australian writer nearly deleted a Yale University e-mail in her junk folder awarding her $150,000 after she assumed it was a hoax.