పోలీసులకే టోకరా వేసి , లక్షలు గుంజిన ఆటోవాలా

Auto Driver Cheated Police Officers In Guntur District

11:04 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Auto Driver Cheated Police Officers In Guntur District

ఓ ఆటో డ్రైవర్‌ చేతిలో పోలీసులే మోసపోయిన ఉదంతం ఇది. పోస్టింగ్‌లు, బదిలీలు చేయిస్తానని స్వయంగా పోలీసుల వద్దే రూ.లక్షలు గుంజిన వ్యవహారం.. పోలీసుశాఖ అంతర్గత విచారణకు ఆదేశించడంతో వెలుగుచూసింది. ఈ ఘటన వివరాలిలా వున్నాయి.

ఇది కూడా చదవండి : ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని దొప్పలపూడికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌ కొద్దికాలంగా పోలీసుస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడు. తన మాట తీరుతో పోలీసు అధికారులను, సిబ్బందిని మచ్చిక చేసుకున్నాడు. వారి అవసరాలకు తన ఆటోను వినియోగిస్తూ, వారికి మరింత దగ్గరయ్యాడు. ఇలా ఏర్పడ్డ పరిచయాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఎలాగంటే, రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి ఒకరు తనకు సన్నిహితమని పేర్కొంటూ, పోలీసు అధికారులతో పాటు సిబ్బందిని తాము కోరుకున్న చోటికి బదిలీ చేయిస్తానని, కాసులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో పోస్టింగ్‌ వేయిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన పోలీసులు తమ బదిలీలు, కావాల్సిన పోస్టింగ్‌లు వేయించాలని రూ.లక్షల నగదు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ అధికారి తన పోస్టింగ్‌ కోసం పెద్దమొత్తంలో నగదును ఇచ్చినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. సదరు అధికారి ఆటోడ్రైవర్‌ సూచించిన పోలీసు శాఖ ఉన్నతాధికారికి స్వయంగా బదిలీ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. ఆ ఉన్నతాధికారి నిజాయితీగా వ్యవహరిస్తాడని పేరుంది. దీంతో ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఉన్నతాధికారులను దీనిపై విచారణ చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :
నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...

'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

ఎపి అసంబ్లీలో 'కంచె'

English summary

An Auto Driver who belongs to Guntur District ,Ponnur Mandal ,Doppalapudi Village was cheated Many police officers and taken lakhs of Ammount by saying that he will transfer them to place they want.Auto Driver said that one of the Top officers was the good friend of him.