'అమ్మ'కోసం ఆటో డ్రైవర్ ఇలా చేసాడు..

Auto driver free trips for Jayalalitha

12:38 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Auto driver free trips for Jayalalitha

తమిళనాడు సీఎం జయలలితకు అభిమానులు కోకొల్లలు. ఆమెకోసం ఏమి చేయడానికైనా సిద్ధపడేవారు చాలామంది వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమెపై తనకున్న వీరాభిమానాన్ని ఓ ఆటో డ్రైవర్ వెరైటీగా చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ళ జి.కుమార్ అనే ఈ ఆటో డ్రైవర్ అపోలో ఆసుపత్రి రోగులనుంచి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా తన ఆటోలో వారిని వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నాడు. ఈ ఆసుపత్రి దగ్గరలోని అంబేద్కర్ నగర్ లో నివసించే కుమార్ గతంలో తన ఆటోను హాస్పిటల్ వద్దే నిలిపేవాడు. అయితే జయ అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో చేరినప్పటినుంచి ఆమెను పరామర్శించేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు ఇతని ఆటోను అక్కడ నిలపవద్దంటూ అతడ్ని పంపేశారు.

కానీ అమ్మకోసం ఈ హాస్పిటల్ పేషంట్లకు ఫ్రీగా సేవలందిస్తానంటూ కుమార్ తిరిగి ఆ పరిసరాలకు చేరుకున్నాడు. తన ఆటో వెనుక అన్నాడీఎంకె పార్టీ ఫ్లెక్సీ తగిలించి రోగులను ఎక్కించుకుంటున్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించేందుకు ఇదొక మార్గంగా ఎంచుకున్నాడట. జయలలిత పూర్తిగా కోలుకుని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు ఇలా ఉచిత సేవలు అందిస్తానని కుమార్ చెబుతున్నాడు.

English summary

Auto driver free trips for Jayalalitha