యువతి డ్రెస్ తీరుపై క్లాస్ పీకిన ఆటో వాలా(వీడియో)

Auto Driver Lectures Girl For Wearing Short Dress

10:17 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Auto Driver Lectures Girl For Wearing Short Dress

సాధారణంగా ఆటో డ్రైవర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తుంటాయి. ఇలా చాలా సంఘటనలు వస్తుంటాయి. కానీ బెంగళూరు నగరానికి చెందని ఓ ఆటో డ్రైవర్ రివర్స్ లో ఓ యువతికి క్లాస్ పీకి షాకిచ్చాడు. కురచ దుస్తులు వేసుకోవడాన్ని అతడు తప్పు పట్టాడు . ఇలాంటి దుస్తులు వేసుకుని బయట తిరగడమేంటని ప్రశ్నించాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఖంగుతింది. ఏప్రిల్ 24న బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ యువతి ఆటో డ్రైవర్ ఫొటో తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐశ్వర్య సుబ్రహ్మణ్యన్ అనే ఆ యువతి జరిగిన విషయాన్నంతా రాసి పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

ఆటో దిగి డబ్బు చెల్లిస్తున్న సమయంలో 'ఏమీ అనుకోవద్దు. మీరు వేసుకున్న దుస్తులు సరిగ్గా లేవు. పొట్టి దుస్తులు కాకుండా పూర్తిగా వేసుకోండి' అని ఆ యువతికి ఆటో డ్రైవర్ చెప్పాడు. మోకాళ్ల కింది వరకు ఉండే దుస్తులు వేసుకోవాలని సూచించాడు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని నీతిమాలిన దానిలా ఉండొద్దన్నాడు. అంతేగాక, తన ఫొటోను తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోమని సెలవిచ్చాడు. దీంతో ఫేస్ బుక్ లో చేసిన ఆ పోస్ట్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి:పాముకి తలలో నాగమణి ఉంటుందా?

English summary

An Auto Driver in Bangalore Lectures a girl named Aishwarya Subramanian for wearing short dress. Auto Driver said that girl to wear full dress and he also said that take a photo of him and post it in Social Media. The girl took photos of the auto driver in and posted in Facebook now this was going viral over Social Media.