శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

Avasarala Srinivas is acting in Hunter remake

11:44 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Avasarala Srinivas is acting in Hunter remake

తొలుత కమీడియన్‌ గా కెరీర్‌ ని ప్రారంభించిన అవసరాల శ్రీనివాస్‌ ఆ తరువాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకునిగా మారి తొలి చిత్రమే విజయాన్ని అందుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సినిమాలకి చిన్న గ్యాప్‌ ఇచ్చిన శ్రీనివాస్‌ ప్రస్తుతం సెక్స్‌కి బానిసైపోయాడట. అసలు విషయంలోకి వెళ్తే ఆ మధ్య బాలీవుడ్‌లో అడల్ట్‌ చిత్రంగా రిలీజైన 'హంటర్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని దర్శకుడు నవీన్‌ మేడారం ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ కధకు సంబంధించి చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్‌ కోసం ఎంతటి దారుణం చెయ్యడానికైనా సిద్ధపడే పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటించబోతున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కామెడీ పాత్రల్లో మెప్పించిన శ్రీనివాస్‌ ఇప్పుడు సెక్స్‌ సైకోగా కనిపించనున్నాడు. మరి ఈ పాత్రతో మెప్పిస్తాడో లేదో చూడాలి. హిందీ సినిమా 'హంటర్' ట్రైలర్ పై ఒక లుక్ వెయ్యండి..

English summary

Avasarala Srinivas is acting in Hunter remake. Avasarala Srinivas is acting in bollywood adult movie Hunter telugu remake.