'అవసరానికో అబద్ధం' ట్రైలర్ వచ్చేసింది

Avasaraniko Abaddam theatrical trailer

11:07 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Avasaraniko Abaddam theatrical trailer

నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్ధమని నువ్వు అనుకునే దాన్ని అబద్ధమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం అంటూ నూతన నటీనటులు లోకేష్, రాజేశ్, శశాంక్, గీతాంజలి, సందీప్ వెంకీ నటించిన అవసరానికో అబద్ధం మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. త్రివిక్రమ్ ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్ర రచయిత, దర్శకుడు సురేశ్ కేవీ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలోని డైలాగ్స్ ను త్రివిక్రమ్ మెచ్చుకోవడం మాకు పెద్ద అభినందన అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Avasaraniko Abaddam theatrical trailer