అవాస్ట్ ఇక పై ఫ్రీ

Avast Antivirus Free For Life

10:49 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Avast Antivirus Free For Life

ఆండ్రాయిడ్ మొబైల్స్, ట్యాబ్లెట్స్ వాడే వినియోగదారులకు సెక్యూరిటీ అతిపెద్ద సమస్య. అయితే ఇందు కోసం ప్రస్తుతం అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కీలకమైనది అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ యాప్. అయితే ఇప్పటి వరకూ ఈ యాప్ వినియోగించాలంటే కాస్త డబ్బులు చెల్లించాలి. ఇంతకు ముందు ఈ యాప్ ట్రయల్ వెర్షన్ లో కొన్ని ఫీచర్లను ఉచితంగా అందిస్తూ వచ్చినా.. ప్రీమియం ఫీచర్లకు మాత్రం కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేది. ఇకపై ప్రీమియం ఫీచర్లను సైతం వినియోగదారులు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ యాప్‌కు చెందిన కొత్త వెర్షన్‌ను యూజర్లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ ద్వారా యూజర్లు తమ డివైస్‌లను వైరస్‌లు, మాల్‌వేర్, స్పైవేర్ తదితర హానికర ఫైల్స్ నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది డివైస్‌లోని ఇంటర్నల్, ఎస్‌డీ కార్డ్ మెమోరీలను స్కాన్ చేసి వైరస్‌లను గుర్తిస్తుంది. దీంతోపాటు యాప్ పర్మిషన్స్, యాప్ లాకింగ్, కాల్ బ్లాకర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. డివైస్‌లోనే కాకుండా ఇంటర్నెట్ నుంచి వ్యాపించే అన్ని రకాల మాల్‌వేర్‌ల నుంచి మొబైల్ కు రక్షణ కల్పిస్తుంది.

English summary

Antivirus maker Avast removed premium pricing from Avast Mobile Security and made all of the app's features free.