2017 క్రిస్మస్‌కి 'అవతార్‌ -2'!

Avatar -2 on 2017 Christmas

02:43 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Avatar -2 on 2017 Christmas

2009 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అవతార్‌' చిత్రం ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ప్రకృతి అందాలను గ్రాఫిక్స్‌తో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. హాలీవుడ్‌ లో అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను ఒక్కసారిగా తుడిచి పెట్టేసింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జేమ్స్‌ కేమరాన్‌ దీనికి కొనసాగింపు అవతార్‌ -2 తీసే పనిలో ఉన్నానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే అవతార్‌-2 కి సంబంధించిన ప్రీ - ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసేయడంతో పాటు, తారాగణం పనులు కూడా పూర్తి చేసేశారు.

త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని అవతార్‌ కంటే ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. 2016 జనవరి మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్‌ ను ప్రారంభించి 2017 సెప్టెంబర్‌ నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని జేమ్స్‌ కేమరాన్‌ భావిస్తున్నారట. అవతార్‌ -2 కూడా 2009 లో క్రిస్మస్‌కి విడుదల చేశారు. అవతార్‌-2 ని కూడా 2017 క్రిస్మస్‌కి విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అంటే ఇంత భారీ చిత్రాన్ని ఒకటిన్నర సంవత్సరంలోపే పూర్తిచేసి క్రిస్మస్‌కి విడుదల చేస్తారు. అవతార్‌ చిత్రాన్ని ముందు మామూలుగా విడుదల చేసి ఆ తరువాత 3డీ వెర్షన్‌ని విడుదల చేశారు. కానీ అవతార్‌-2 మాత్రం 3డీ వర్షెన్‌లోనే విడుదల చెయ్యాలని జేమ్స్‌ కేమరాన్‌ నిర్ణయించుకున్నారు.

English summary

Avatar -2 is releasing on 2017 Christmas.