సినిమా లకి గుడ్ బై చెప్పేస్తున్నా...

Avika Gor giving break to movies

04:58 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Avika Gor giving break to movies

అవికా గోర్ అంటే చాలా మందికి ఈ పేరు తెలీదు. అదే ఆనంది అని చెప్పండి దేశవ్యాప్తంగా ఈ పేరు తెలుసు. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆ తరువాత సినిమా ల్లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో మంచి హిట్ అందుకున్న అవికా ఆ తరువాత లక్ష్మిరావే మాఇంటికి, సినిమా చూపిస్తా మావ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంది. తాజాగా ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ పరిశ్రమ నుండి ఆఫర్లు కూడా సొంతం చేసుకుంటోంది. క్రేజ్ ఇలా పీక్ పొజిషన్ లో ఉన్న టైమ్ లో సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుంటోందట ఈ చిన్నారి పెళ్లి కూతురు.

ఎందుకంటే ప్రస్తుతం తన వయసు తక్కువే కాబట్టి కొన్ని రోజులు సినిమా లు పక్కన పెట్టి… బుద్ధిగా చదువుకొని ఆ తర్వాత మళ్లీ సినిమా ల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందట. అయితే ఇప్పడంటే క్రేజ్ ఉంది కాబట్టి ఆఫర్లు వస్తున్నాయి. రీఎంట్రీలో ఈమెను ఎవరైనా పట్టించుకుంటారా? లేదా? అనేది తెలీదు. ఇంతకు ముందు రిచా గంగోపాధ్యాయ కూడా ఇలానే మాయమైంది. ఆఫర్లు లేవనుకుంటున్న టైమ్ లో 'మిర్చి' చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇక ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయనుకున్న టైమ్ లో సినిమాల నుంచి తప్పుకుంటున్నాని సింపుల్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పడేసి… అమెరికా చెక్కేసింది. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటోంది.

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Avika Gor giving break to movies. Chinnari Pellikuthuru Anandi(Avika Gor) giving break to movies for her higher studies.