ఇండస్ర్టీకి గుడ్ బై కొట్టేస్తోందా ....

Avika Gor To Give Break For Acting

10:13 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

Avika Gor To Give Break For Acting

కొన్ని కొన్ని విషయాలు గుంభనంగా సాగిపోతుంటాయి. ఎందుకు ఏమిటి అనేలోపే జరిగేది జరిగి పోతుంది. ఇంతకీ విషయమేమంటే, ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన అవికాగోర్ గ్లామర్ ఇండస్ర్టీకి గుడ్ బై చెప్పేస్తోందా? అనే టాక్ నడుస్తోంది. హిందీలోనే కాదు టాలీవుడ్‌లోనూ తక్కువ టైమ్‌లో ఫ్యాన్స్‌కు సంపాదించుకున్న ఈమె, ‘ఉయ్యాలా జంపాలా’ హిట్ తర్వాత యూత్‌కి మరింత దగ్గరయ్యింది. ఇప్పటికే ఎడాపెడా సినిమాలు చేయడంతో చదువు పక్కనపెట్టేసినట్టు తెలుస్తోంది. అందుకే చదువు పై శ్రద్ధ పెట్టేందుకు గ్లామర్ ఇండస్ర్టీకి కాస్త విరామం ఇవ్వాలన్నది ఆమె ఆలోచనట.

ఇవి కుడా చదవండి:'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

ఈలోపే చదువు పూర్తి చేసి, సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని స్కెచ్ వేస్తున్నట్లు బాలీవుడ్ టాక్. ఈ అమ్మడి వాదనను సినీ లవర్స్ తోసిపుచ్చుతున్నారు. గ్లామర్ ఇండస్ర్టీలో ఆఫర్స్ రావడంతో ఇప్పుడు చదువు గుర్తుకొచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అవికా వైపు చూస్తే నిజమేనని అంటున్నారు. మొత్తానికి కొన్నాళ్ల వరకు అవికాను సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించే ఛాన్స్ లేదన్నమాట.

ఇవి కుడా చదవండి:బిచ్చగాడికి లాటరీ.. రూ. 65 లక్షలు జాక్ పాట్

English summary

Chinnari Pelli kuthuru fame Avika Gor who had played Anandi Role in that Serial was decided to stop acting for few years to continue her studies.