వీటి జోలికి అసలు వెళ్లొద్దు!!!

Avoid 5 healthy foods

01:02 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Avoid 5 healthy foods

ప్రస్తుత కాలంలో ప్రతీదానికి అనుకరణగా మరో పదార్ధాన్ని తయారు చేస్తున్నారు. ఉదాహరణకి షుగర్‌, షుగర్‌ ఫ్రీ ఇలా చాలా వాటిని రీప్లేస్‌ చేస్తూ ఉన్నాం. నిజజీవితంలో ఇలాంటి రీప్లేస్‌ల వల్ల కొంత మంచి జరుగుతుంది, అలాగే కొన్ని సందర్బాలలో దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. టిఫిన్‌ కి బదులుగా ఏవో తాగడం, భోజనానికి బదులుగా ఏదో ఒకటి తినేయడం ఇలా చేయడం వల్ల అనారోగ్యపాలు అవుతుంటారు. కొన్ని దూరంగా ఉంచదగ్గ ఆహారపదార్ధాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

1. కేన్‌లో ఉండే జ్యూస్‌

జ్యూస్‌లు తాగడం కంటే పండ్లు తినడం చాలా మంచిది. జ్యూస్‌లు బయట కొనుక్కొని తాగడం వల్ల అందులో తీపి పెంచడానికి చెక్కరని వేస్తారు. చెక్కర అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే బయట లభించే కేన్‌లో ఉండే జ్యూస్‌లని తాగడం వల్ల అనారోగ్యపాలు అవుతారు. తాజా పండ్లు తినడం వలన శరీరానికి శక్తి ఇచ్చి అలసట నుండి దూరం చేస్తుంది. రక్తంలో చెక్కర శాతం తక్కువ కలిగిన వారు పండ్లు తినడం వల్ల సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు.

English summary

Avoid These 5 Healthy Foods for your better health. Of course these are healthy but taking heavy will infect your health. Have a look of these foods.