పాలిచ్చే తల్లులకు కేన్సర్ వచ్చినా బతికేస్తారట!

Avoid cancer by feeding milk to your babies

04:29 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Avoid cancer by feeding milk to your babies

కన్న బిడ్డలకు పాలివ్వడమే ఇబ్బందిగా ఫీలవుతారు కొందరు తల్లులు. తమ అందం తరిగిపోతుందని, డబ్బా పాలు పెట్టేస్తుంటారు. ఇక ఆలనా పాలన చూసే తీరిక వుండదన్నట్లు తెగ ఫీలైపోతారు. కానీ ఇప్పుడు పరిశోధనలో ఓ నిజం బయట పడింది. బిడ్డలకు పాలిచ్చే తల్లులకు రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని ఇదివరకే పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఒకవేళ వారికి రొమ్ము కేన్సర్ వచ్చినా, 20 ఏళ్ల తర్వాత కూడా బతికే అవకాశాలు ఎక్కువని తాజాగా స్వీడన్, నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇరవై ఏళ్ల క్రితం రొమ్ము కేన్సర్ కు శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలపై వీరు పరిశోధన నిర్వహించగా..

ఆరు నెలలకు పైగా పిల్లలకు పాలిచ్చిన తల్లులు రొమ్ము కేన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 20 శాతం వరకూ తగ్గిందని వెల్లడైంది. అలాగే వీరిలో రొమ్ము కేన్సర్ తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరి పరిశోధన వివరాలు బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. తల్లులూ ఇకనైనా మారండి... బిడ్డలకు పాలివ్వండి అంటూ నెటిజన్లు కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

ఇది కూడా చదవండి: లేడీస్ బాత్ రూమ్ కి కన్నం పెట్టి.. ఆపై వీడియో తీసి..

ఇది కూడా చదవండి: గర్ల్ ఫ్రెండ్ తో మొదటిసారి అడ్డంగా దొరికేసిన అఖిల్(ఫోటోలు)

ఇది కూడా చదవండి: భార్యకి కడుపు రావడం లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

English summary

Avoid cancer by feeding milk to your babies