ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్నారా? అయితే దీనితో నివారించొచ్చు..

Avoid cockroach with Cucumber

01:25 PM ON 24th November, 2016 By Mirchi Vilas

Avoid cockroach with Cucumber

మీ ఇంట్లో బొద్దింకలున్నాయా అయితే ఈ మందు వాడండి అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం. ఎందుకంటే, బొద్దింక చూస్తేనే కాదు ఆ పేరు వింటేనే కంపరంగా ఉంటుంది. ఇల్లును ఎంత నీట్ గా ఉంచినప్పటికీ ఏ మూల నుండి ప్రవేశిస్తాయో చెప్పలేం. ముఖ్యంగా వంట గదిలో బొద్దింక తిష్ట వేసుకు కూర్చుంటుంది. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ చేరిపోయి ప్రతి మూల, ప్రతి పాత్ర ప్రతి చోట దర్శనమిస్తూ ఇల్లాలిని చిరాకు పెట్టేస్తాయి. ఇక బొద్దింకలు రావడం అనేక సూక్ష్మక్రిములను, రోగాలను తీసుకొస్తాయి. ఎన్నో సహజ పద్ధతులు, మరెన్నో రసాయనాలు వాడినప్పటికీ పోయినట్టే పోయి మళ్లీ వచ్చేస్తాయి.

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే రసాయనాలు వాడడానికి కొంత ఇబ్బందే. అలాంటప్పుడే బొద్దింకలను తరిమి కొట్టడానికి సహజ పద్ధతులు బాగా ఉపయోగపడ్తాయి. అందులో ప్రధానంగా దోసకాయ గురించి చెప్పుకోవాలి. దానివలన బొద్దింకలు ఎలా పోతాయో చూద్దాం...

1/6 Pages

దోసకాయల ద్వారా మీ కుటుంబసభ్యుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలుగకుండా బొద్దింకలను పారద్రోలవచ్చు. ఇది బొద్దింకలను తొలగించడానికి ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గంగా చెబుతారు. దోసకాయలు బొద్దింకలకు వ్యతిరేకంగా ఒక అవరోధం వలె పనిచేస్తుంది. తద్వారా హానికరమైన సూక్ష్మజీవుల వృద్ధిని నిలిపివేస్తుంది.

English summary

Avoid cockroach with Cucumber