మళ్ళీ తెరమీదికి  అయోధ్య వివాదం ....

Ayodhya Dispute

11:30 AM ON 8th December, 2015 By Mirchi Vilas

Ayodhya Dispute

దాదాపు పాతికేళ్ళకు పూర్వం దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య గురించే. బిజెపి అగ్రనేత అద్వాని రధయాత్ర, అరెస్టు , ఊరూ వాడా ఇటుకల (శిలా న్యాస్ ) కు పూజ , కరసేవకులతో హడావిడి , చివరకు 1992లొ అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత వంటి ఘటనలతో దేశం అట్టుడికి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెరమీదికి వస్తోంది. వివరాల్లోకి వెళితే 23 ఏళ్ల కిందట కూల్చివేతకు గురైన వివాదాస్పద కట్టడం (కొందరు రామాలయంగా.. మరికొందరు బాబ్రీ మసీదుగా వ్యాఖ్యానిస్తుంటారు.అయితే సుప్రీం కోర్టు మాత్రం విస్పష్టంగా దాన్ని వివాదాస్పద కట్టడంగా వ్యవహరించాలని.. మీడియాలోనూ అలానే రాయాలని ఆదేశించింది) వివాదాస్పద కట్టడా ప్రదేశం లోనే స్థానంలో రామాలయాన్ని నిర్మిస్తామని.. అది కూడా రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ విశ్వహిందూ పరిషత్ తాజాగా ప్రకటించింది. దీంతో మళ్ళీ ఈ వివాదం చర్చల్లోకి వచ్చింది.

వివాదాస్పద కట్టడం కూలిపోయిన డిసెంబర్ 6ను కొన్ని పక్షాలు బ్లాక్ డే గా.. మరికొన్ని పక్షాలు శౌర్య దివస్ గా జరుపుకోవటం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీ ఆదివారం నాడు శౌర్యదివస్ ను వీహెచ్ పీ లాంటి హిందుత్వ సంస్థలు నిర్వహించగా.. బ్లాక్ డేగా ముస్లిం వర్గాలు పాటించాయి. ఈ నేపథ్యంలో వీహెచ్ పీ నేతలు మాట్లాడుతూ.. రానున్న రెండేళ్ల వ్యవధిలో అయోధ్యలో రామాలయం కట్టటం ఖాయమని చెప్పారు.

బెజిపి సారధ్యంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం 1199లొ అధికారం చేపట్టినపుడు ప్రధానిగా వాజ్ పాయ్ వున్నారు. పార్టీ ఎజెండాను పక్కన పెట్టి , ఉమ్మడి ఎజెండా తో అప్పుడు బెజిపి ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్ అధికారంలో వుండగా ఇప్పుడు బిజెపి సొంతంగా మెజార్టీ సాధించింది. అయినా ఎన్డిఎ పక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ నడుపుతున్నారు. రాజ్య సభలో ఇంకా మెజార్టీ లేదు. దీనికి తోడు ఇటీవల బిహార్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘోరంగా దెబ్బతింది.ఇటీవల అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తూ, గుడి కడతామని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ అంటే , ఎప్పటికీ కుదరదని ఎంఐఎం నేత అసదుద్దీన్ అంటున్నారు. కోర్టులో వున్న ఈ వివాదం మళ్ళీ తెరమీదికి రావడంతో పరిస్థతి ఎటు దారితీస్తుందో చూడాలి.

English summary

Once again Ayodhya Temple dispute started in India.RSS cheif Mohan bhawath says that they will defenately build Lord Rama Temple and MIM leader Assadudeen says that will not possible forever