రూపాయికే 40లీటర్ల పెట్రోలు - 60లీటర్ల డీజిల్ ఇవ్వాలట

Azad Bharat Vidhik Vaicharik Kranti Satyagrahi Demands

11:33 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Azad Bharat Vidhik Vaicharik Kranti Satyagrahi Demands

అబ్బ,ఆశ, దోస, అప్పడం... అని అనాలని వుంది కదూ. పెరుగుతున్న ధరలను చూస్తే లీటర్ పెట్రోలు, డీజిల్ రెట్లు ఏ స్థాయికి చేరాయో ఎవరికీ తెలియంది కాదు. అయితే రూపాయికే 40 లీటర్ల పెట్రోలు, అలాగే రూపాయికే 60 లీటర్ల డీజిల్ ఇవ్వాలట. ఇది సాధ్యమేనా? కానీ 'ఆజాద్ భారత్ వైధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి' అనే గ్రూప్ ఈ డిమాండ్ చేస్తోందట. ఉత్తర ప్రదేశ్ లోని మధురలో చెలరేగిన హింసాకాండ వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నకు 'ఆజాద్ భారత్ వైధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి' అనే గ్రూప్ ఈ పనికి పాల్పడిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థ కూడా ఈమేరకు క్లెయిమ్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా ఈ గ్రూప్ చెప్పుకుంటోంది. కాగా, ఈ గ్రూప్ కు చెందిన వాస్తవాలు కొన్ని బయటకు వచ్చాయి.

దేశ అధ్యక్షుడు, ప్రధానిని తొలగించడం, ఇండియన్ కరెన్సీ నిలిపివేయడం వంటివి ఈ గ్రూప్ డిమాండ్లలో ఉన్నాయట. రూపాయి బదులు 'ఆజాద్ హిందుహౌస్ కరెన్సీ'ని ప్రవేశపెట్టాలని ఆ గ్రూప్ కోరుతోంది. 40 లీటర్ల పెట్రోలు ఒక రూపాయికే ఇవ్వాలి. 60 లీటర్ల డీజిల్ సైతం రూపాయికే అందుబాటులోకి తీసుకురావాలి అని డిమాండ్ పెట్టిందట. మధురలో చాలాకాలం క్రితం నిరసనల్లో పాల్గొన్న గ్రూపుల్లో 'ది ఆజాద్ భారత్ వైధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి' ఒకటి. వీరు బాబా జై గురుదేవ్ అనుచరులుగా చెప్పుకుంటారు. నేతాజీకి చెందిన అన్ని డాక్యుమెంట్లు ప్రజల ముందుంచాలన్నది మరో డిమాండ్. అధ్యక్షుడు, ప్రధాని ఎన్నికలను రద్దు చేయాలని కూడా డిమాండ్ వుంది. కాగా, రామ్ వ్రిక్ష్ యాదవ్, చందన్ బోస్, గిరీష్ యాదవ్, రాకేష్ గుప్తాలు ఈ గ్రూప్ కీలక నేతలనీ, ఇప్పటికీ వారు సజీవంగా ఉండి ఉంటే పోలీసులు పట్టుకుంటారని యూపీ డీజీపీ జావిద్ అహ్మద్ చెబుతున్నారు. వీరిలో రామ్ వ్రిక్ష యాదవ్ ను మాత్రమే పోలీసులు గుర్తుపట్టగలరని, మిగతా వారి సమాచారం వారివద్ద లేదని కూడా తెలుస్తోంది. మధుర ఘర్షణల 'మాస్టర్ మైండ్ 'గా పోలీసులు అనుమానిస్తున్న రామ్ వ్రిక్ష యాదవ్ ఘజీపూర్ లోని రాయ్ పూర్ బాగ్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి.

ఇవి కూడా చదవండి:ఈ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

ఇవి కూడా చదవండి:అది కాల్చబోతే... ఇది కాలిందిరో(వీడియో)

English summary

Azad Bharat Vidhik Vaicharik Kranti Satyagrahi Demands that prime minister have to resign and government have to give 40 liters of petrol for 1 rupee and 60 liters of diesel for 1 rupee.