నవంబర్ నుంచే బాహుబలి-2 ఫీవర్ మొదలు

Baahubali 2 fever starts from november

12:12 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Baahubali 2 fever starts from november

'బాహుబలి' సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. అందుకే బాహుబలి -2 అదేనండీ, బాహుబలి ద కంక్లూజన్ సినిమా ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ బిజినెస్ డీల్ అంతా అయిపోవడంతో.. బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఏకంగా 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందని అంటున్నారు. అది మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా 2017 ఏప్రియల్ 28న రిలీజ్ అవుతోందనగానే అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ బాహుబలి టీమ్ ఈ డేటును అందుకోవడానికి ఫుల్లుగా ప్రిపేర్ అయ్యిందా మరి? అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా ఎనౌన్స్ చేసారని అంటున్నారు. దీనికి సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు రాజమౌళి ఆగస్టు 31 లోపు మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నాడట.

ఇప్పటికే క్లైమాక్స్ యుద్ధాన్ని ఆయన పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం షూటింగ్ అవ్వగానే, కొన్ని లింకింగ్ సీన్స్ సెప్టెంబర్ లో తీస్తారట. అనుష్క అండ్ రానా కూడా అప్పుడు షూటింగులో పాల్గొంటారు. ఆ తరువాత నవంబర్ లో ప్రభాస్-అనుష్క, ప్రభాస్-తమన్నా మీద రెండు పాటలను షూట్ చేసి, ఆ నెలాఖరుకు మొత్తం సినిమా షూటింగును పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే నవంబర్ నుండి ప్రమోషన్లను మొదలెట్టేస్తారట. కొత్త క్యారెక్టర్ల తాలూకు ఫస్ట్ లుక్ - పాత క్యారెక్టర్ల కొత్త లుక్ - అలాగే పాటల టీజర్లు - కొత్త టీజర్లు - చివరకు ఆడియో అండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తారట. ఒకేసారి తెలుగు - తమిళ్ - హిందీలలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు సంబంధించి, అన్నీ పక్కాగా జరగాలని జక్కన్న కృత నిశ్చయంతో వున్నాడట.

English summary

Baahubali 2 fever starts from november