'బాహుబలి -2' విడుదల తేదీ ప్రకటన(ఫోటోలు)

Baahubali 2 first look released

12:48 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Baahubali 2 first look released

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు బాహుబలి-2 రాబోతోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రచార పర్వానికి తెరలేపింది. ఈనేపధ్యంలో బాహుబలి-2 విశేషాలను తెలియజేసేందుకు సినిమా టీమ్ మీడియా ముందుకు వచ్చింది.. చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రధాన పాత్రలు ప్రభాస్, రానాలు మాట్లాడారు. 2017 ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బాహుబలి-2 లోగో ఆవిష్కరించారు. అక్టోబర్ 22న బాహుబలి కామిక్ బుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు సినీ హీరో ప్రభాస్ ప్రకటించాడు.

బాహుబలి 2 కోసం తన అభిమానులే కాకుండా, అందరూ ఎదురు చూస్తున్నారని అన్నాడు. బాహుబలి 2 ఫస్ట్ లుక్ అక్టోబర్ 22న రిలీజ్ కాబోతున్నట్లు ప్రభాస్ చెప్పాడు.. బాహుబలి చిత్రీకరణ సమయంలో మూడు నెలలకు పైగా ఖాళీ దొరికినా కేవలం విశ్రాంతి తీసుకుందామనే మరో చిత్రం చేయలేదని ప్రభాస్ అన్నాడు. మహా సముద్రం మధ్య చిన్న నదిని వదలడం భావ్యం కాదనిపించిందన్నారు. దర్శకుడు సుజిత్ తో సహా రెండు, మూడు చిత్రాలు వరుసలో ఉన్నాయని చెప్పాడు.. కాగా ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23నే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఆయన అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.

బాహుబలి-2కోసం అత్యున్నత టెక్నాలజీ వర్చువల్ రియాలిటీని వాడామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ టెక్నాలజీతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని, నిజంగా మాహిశ్మతి రాజ్యంలో తాము ఒక పాత్రధారులలాగా, ప్రతి సీన్ ను దగ్గరగా ఉండి చూసినట్లు ఫీలవుతారని రాజమౌళి అంటున్నాడు.

1/18 Pages

ఇంకా జక్కన్న మాటల్లో ఏమన్నాడంటే..


అక్టోబర్ 1న బాహుబలి యానిమేటెడ్ టీజర్ విడుదల చేస్తాం.

English summary

Baahubali 2 first look released