23న బాహుబలి-2 ఫస్ట్ లుక్ టీజర్!

Baahubali 2 first look teaser on october 23rd

12:27 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Baahubali 2 first look teaser on october 23rd

బాహుబలి సూపర్ డూపర్ హిట్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా బాహుబలి- ద కన్ క్లూజన్. ఈ సినిమాపై అంత ఆసక్తి రావడం పెద్ద అతిశయోక్తి కాదు. ఎందుకంటే బాహుబలి సృష్టించిన ప్రభంజనం ఇంకా మరిచిపోలేదుగా. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్న బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబరు నాటికి షూటింగ్ ను పూర్తి చేసి ఫిబ్రవరి చివరి నాటికి తొలి కాపీని విడుదల చేయాలని డైరెక్టర్ రాజమౌళి భావిస్తున్నాడు. మార్చి నుంచి మీడియా సంస్థల్లో ఆ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని జక్కన్న నిర్ణయించాడట. అప్పటి వరకు అభిమానులకు ఎదురుచూపులు తప్పకమానదు.

కానీ, దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేలా సినీ అభిమానులకు జక్కన్న ఓ కానుక ఇవ్వబోతున్నాడని టాక్. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబరు 23న ఆ కానుకను వారికి అందిస్తాడట. ఆ కానుక బాహుబలి-2 ఫస్ట్ లుక్ టీజర్. ఆ రోజు టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తిని రేకెత్తించే ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడని అంటున్నారు. ఇక, వచ్చే వేసవి అంతా బాహుబలి-ద కన్ క్లూజన్ వేడే కనిపించబోతోందని సినీ వర్గాలలో జోరుగా వినిపించే మాట. ఆ సమయంలో బాహుబలిని ఢీకొట్టడానికి వేరే పెద్ద సినిమాలూ వెనకాడాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారట. ఆ సినిమా విడుదలైన కనీసం మూడు వారాల తర్వాత గానీ పెద్ద హీరోలు సినిమాలను విడుదల చేయడానికి సాహసం చేయరేమోనని విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదల మాట ఎలా ఉన్నాగానీ.. బాహుబలి-2 వచ్చేంత వరకు మాత్రం అభిమానులకు ఈ టీజర్ తో పండుగే. అది చూడాలంటే అక్టోబరు 23 వరకు ఆగాల్సిందే మరి.

ఇది కూడా చదవండి: ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: అమ్మాయినంటూ చాటింగ్.. ఆతర్వాత ఏం చేశాడంటే..

ఇది కూడా చదవండి: ప్రియమైన నాన్నా... ఆ సినిమా చూసి తండ్రికి కూతురు లేఖ!

English summary

Baahubali 2 first look teaser on october 23rd.