‘బాహుబలి’ కంక్లూజన్ విజువల్స్ అదుర్స్

Baahubali 2 movie exclusive visuvals

11:45 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Baahubali 2 movie exclusive visuvals

జక్కన్న సారధ్యంలో ‘బాహుబలి 2’ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్లు ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా ఫినిష్ చేయాలన్నది జక్కన్న అండ్ కో ప్లాన్. ఇప్పటికే టెక్నికల్ టీంతో సిట్టింగ్స్‌లో కూర్చున్న రాజమౌళి, ఇప్పుడు డిజైన్ లో నిమగ్నమయ్యాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్‌లో భళ్లాలదేవ విగ్రహం కనిపించింది. పాత సెట్‌కి టెక్నాలజీ పరంగా మరమ్మత్తులు చేస్తోంది యూనిట్. దీనికి సంబంధించి పనులు రామోజీ ఫిల్మ్‌సిటీలో స్పీడ్‌గా జరుగుతున్నాయి.

రెండుమూడు రోజుల్లో ఈ విగ్రహం రెడీ కావచ్చున్నది యూనిట్ ఆలోచన. ఇక స్టోరీ విషయానికొస్తే.. అల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో భళ్లాలదేవ విగ్రహాన్ని వెండితెరపై చూపించిన డైరెక్టర్ రాజమౌళి, ఈసారి ఎవరి స్టాట్యూ చూపిస్తాడనే ప్రశ్నలు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. చాలామంది బాహుబలి విగ్రహమని చెబుతున్నారు. మొత్తానికి బాహుబలి2 హంగామా మొదలైందనే చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి: ఈ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

ఇది కూడా చూడండి: 6వేల మంది బట్టలిప్పేసి నిరసన

ఇది కూడా చూడండి: నైజాంలో రూ.10 కోట్లు క్రాస్ !

English summary

Baahubali 2 movie exclusive visuvals.