'బాహుబలి-2' షూటింగ్‌ ఫోటో లీక్‌

Baahubali 2 Movie First Photo From Sets

02:48 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Baahubali 2 Movie First Photo From Sets

దర్శకధీర ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం రెండవ పార్ట్‌ 'బాహుబలి ద కంక్లూషన్‌' షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 2015 డిసెంబర్‌ నెలాఖరులో షూటింగ్‌ మొదలైన ఈ చిత్రం ఇప్పటికి రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా యూఎస్‌ లో చిత్రీకరణకి ఈ చిత్ర టీమ్‌ బయల్దేరుతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌ మొదలై 3 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఈ షూటింగ్‌ కి సంబందించిన ఫోటోలేవీ బయటకి రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ కి సంబందించిన ఒక ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. దర్శకుడు రాజమౌళి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాయి సిరిల్‌, సినిమాటోగ్రాఫర్‌ కె.కె. సెంధిల్‌ కుమార్‌ ఈ ఫోటోలో ఉన్నారు.

English summary

Rajamouli's upcoming film Baahubali 2 Shooting official photos have been leaked and making rounds on social media. Here is the first snap of Baahubali 2 from the sets.