అమెరికా లో బాహుబలి

Baahubali 2 next schedule in US

10:13 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Baahubali 2 next schedule in US

'బాహుబలి -2' రెండవ షెడ్యూల్‌ కేరళలోని కన్నూర్‌ అడవుల్లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌ వారం పదిరోజులు పైగా కొనసాగింది. ఇందులో అనుష్క, ప్రభాస్‌ మరికొందరి పై ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక చిన్న బ్రేక్‌ తరవాత ఈ సినిమా చిత్రీకరణ కోసం యూఎస్‌ వెళ్ళనున్నారని సమాచారం. ఈ సినిమా యూనిట్‌ పారిస్ వెళ్ళబోవడం ఇది రెండవసారి. మొదటి భాగంలో బల్గేరియాలోని కొండ ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ రెండవ భాగంలో ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారో అని ఉత్కంఠభరితంగా ఉంది. రాజమౌళి సాధారణంగా తన అభిమానులతో ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా అన్ని విషయాలను పంచుకుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో మౌనంగా ఉన్నాడు.

English summary

Baahubali 2 movie next schedule in Unite States of America. This movie is directing by S.S. Rajamouli. Prabhas, Anushka and Tamanna is acting in lead roles.