బాహుబలి-2 రిలీజ్ డేట్ మళ్ళీ చేంజ్..!

Baahubali 2 release date was changed

11:13 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Baahubali 2 release date was changed

ఏదైనా ఓ ప్రాజెక్ట్ అనుకుంటే, అందుకు తగ్గ పక్కా ప్లాన్, వేసుకునే మరీ దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి-ది కంక్లూజన్ వాస్తవానికి ఈ ఏడాదే విడుదల చేయాలనీ భావించడం, కంక్లూజన్ 2016 అంటూ బాహుబలి ముగుంపులో స్లైడ్ పడడం తెల్సిందే. కానీ అఆతర్వాత ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా కొత్త తేదీని ప్రకటించడం విశేషం. వచ్చే ఏడాది (2017) ఏప్రిల్ 28న విడుదల అవుతుందని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ట్విటర్ లో పేర్కొన్నాడు. దీంతో ఈ భారీ బడ్జెట్ మూవీ పై నెలకొన్న సస్పెన్స్ వీడింది.

సుమారు 300 కోట్ల బడ్జెట్ తో బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్నట్టు చెప్పవచ్చు. ఈ మూవీకి సంబంధించి మాహిష్మతీ రాజ్యం సెట్టింగులు ఫస్ట్ పార్ట్ లో కన్నా అద్భుతంగా ఉండాలని జక్కన్న చేసిన సూచన మేరకు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇందుకోసం తెగ శ్రమిస్తున్నారు. సుమారు 500 మంది సిబ్బంది కూడా అహోరాత్రాలూ కష్టపడుతున్నారట. ఇవన్నీ అంచనాలు మారడం నేపథ్యంలో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. కనీసం ఇప్పుడు మార్చిన దానిప్రకారం ఏప్రియల్ 28న అయినా విడుదల అయ్యేనా?

English summary

Baahubali 2 release date was changed