లీకైన 'బాహుబలి-2' స్టోరీ!!

Baahubali -2 story leaked

12:01 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Baahubali -2 story leaked

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం తెలుగులో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం ద్వితీయ భాగం ఘాటింగ్‌ జరుగుతుంది. అయితే మొదటి భాగం చిత్రీకరణ జరుగుతుండగానే యుద్ధ సన్నివేశం మేకింగ్‌ వీడియోని ఎవరో ఇంటర్నెట్‌లో లీక్‌ చేశారు. ఇప్పుడు తాజాగా 'బాహుబలి-2' చిత్రీకరణలో ఉండగానే ఈ చిత్రం స్టోరీని లీక్‌ చేసేశారు.

బాహుబలి-2 స్టోరీ..

ప్రభాస్‌ (బాహుబలి), రానా (భల్లాల దేవ) ఇద్దరూ అనుష్క(దేవసేన) ని ప్రేమిస్తారు. కానీ అనుష్క మాత్రం ప్రభాస్‌ని ఇష్టపడుతుంది. కానీ రమ్యకృష్ట(శివగామి) మాత్రం అనుష్కని ఇచ్చి తన కొడుకు రానాతో పెళ్లి చెయ్యాలనుకుంటుంది. ఈ నేపధ్యంలో అనుష్క రానా కి నో చెప్తుంది. అనుష్క రానాతో పెళ్లికి నిరాకరించడంతో మొదటి భాగంలో ప్రభాస్‌కి అనుకూలంగా ఉన్న రమ్యకృష్ణ ఇక్కడ నుండి ప్రభాస్‌ పై కక్ష కడుతుంది. అనుష్క ని పెళ్లి చేసుకోవాలంటే ప్రభాస్‌ ని చంపేయాలని రానా కుట్ర పన్నుతాడు. ఈ నేపధ్యంలో రానా ప్రభాస్‌ ని చంపేస్తాడు.

ఆ తరువాత తన భర్త నాజర్‌(బిజ్జిల దేవుడు) తన కొడుకు రానా నిజస్వరూపం తెలుసుకున్న రమ్యకృష్ణ ఆ తరువాత ప్రభాస్‌ మంచితనాన్ని తెలుసుకుంటుంది. అప్పుడే బాహుబలి కొడుకు(శివుడు) ని కాపాడుతుంది. ఇది మొదటి భాగం స్టార్టింగ్‌లో చూపిస్తాడు. ఆ తరువాత శివుడు(పభాస్‌) తన తండ్రిని చంపిన వారి పై ఎలా పగ తీర్చుకున్నాడనేదే పూర్తి కధాంశం. మొదటి భాగంలోలానే రెండో భాగంలో కూడా 40 నిముషాల యుద్ధ సన్నివేశం ఒకటి ఉంటుందని సమాచారం.

English summary

S.S. Rajamouli prestiguous movie Baahubali -2 story was leaked in internet. In this movie Prabhas, Anushka and Tamanna was acting in lead roles.