క్రికెట్ ఆడుతున్న బాహుబలి టీం(వీడియో)

Baahubali 2 team playing cricket in sets

04:53 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Baahubali 2 team playing cricket in sets

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్క్లూజన్' చిత్రం ప్రస్తుతం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధం చివరిరోజు షెడ్యూల్ కు వర్షం వల్ల అంతరాయం కలిగిందట. దీంతో షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్ ను యూనిట్ సభ్యులు క్రికెట్ ఆడి సమయాన్ని వినియోగించుకున్నారని రాజమౌళి ట్వీట్ చేశారు. అంతేకాకుండా టీం క్రికెట్ ఆడుతుండగా తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రానా, తమన్నా, అనుష్క ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బాహుబలి 2' లో నటించాల్సిన అనుష్క 'సైజ్ జీరో' చిత్రం కోసం 20 కిలోల బరువు పెరిగిపోయింది. ఆ బరువును తగ్గించుకోవడానికి ఏడెనిమిది నెలల నుంచి కష్టపడుతోంది. యోగా చేసింది.. జిమ్ లో వ్యాయామాలూ చేసింది. అయినా అనుకున్న స్థాయికి బరువు తగ్గకపోవడంతో ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని సైకిలేసుకుని రోడ్ల మీద తెగ తొక్కేస్తుందట. ఒకసారి బాహుబలి టీం క్రికెట్ ఆడిన వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: నిద్రలో ఉన్నప్పడు పడిపోతున్నామనే భావన ఎందుకు కలుగుతుంది?

ఇది కూడా చదవండి: అభిమానికి బంపరాఫర్ ఇచ్చిన రష్మీ!

ఇది కూడా చదవండి: మరీ ఇంత హాట్ గా తాప్సీని ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)

English summary

Baahubali 2 team playing cricket in sets. Baahubali The Conclusion team playing cricket in the last day of war shooting because of rain.