ఈ 'బాహుబలి' దున్నపోతుని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Baahubali buffalo in Uttar Pradesh

11:10 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Baahubali buffalo in Uttar Pradesh

టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవతో పోరాడి ఓడిన భారీ దున్నపోతు గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ ఇది గుర్తుండే అంశం. ఇంతకీ అది రియల్ దున్నపోతు కాదు. అదంతా గ్రాఫిక్స్ మాయాజాలం. కానీ, దాదాపు అలాంటి భారీ దున్నపోతు ఒకటి ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో దర్శనమిచ్చింది. మహ్మద్ తౌఫిక్ ఖురేషి, నదీం అనే వ్యక్తులు పంజాబ్ లోని లుధియానాలో 11 లక్షల రూపాయలకు ఈ దున్నపోతుని కొనుగోలు చేశారు. బక్రీద్ కోసం సొంతూరు మొరాదాబాద్ కు తీసుకొచ్చారు. ఈ భారీ దున్నపోతుకు బాహుబలి అని పేరు పెట్టారు. ఒ

కటిన్నర టన్ను బరువుండే ఈ దున్నపోతు స్థానికంగా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. భారీ బర్రెను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొంతమంది సెల్ఫీ తీసుకుని మురిసిపోతున్నారు. 'ముర్రా'జాతికి చెందిన ఈ దున్నపోతుకు సాధారణ ఆహారంతో పాటు రోజుకు 20 లీటర్ల పాలు, 20 కేజీల ఆపిల్ పండ్లను పెడుతున్నాం. దీని కోసం రెండు వాటర్ కూలర్లు, సీలింగ్ ఫ్యాన్ ఉన్న ప్రత్యేక గదిని ఏర్పాటు చేసాం అని ఖురేషి తెలిపాడు. బక్రీద్ సందర్భంగా తాము కొన్న ధర కంటే రెట్టింపు ధరకే బాహుబలి అమ్ముడు పోతుందని, ఒకవేళ తాము అనుకున్న ధరకు ఎవరూ కొనకపోతే దున్నపోతుని తామే దేవుడికి బలివ్వాలని ఉద్ధేశ్యంతో పక్కా ప్లాన్ వేసుకోవడం కొసమెరుపు.

ఇది కూడా చదవండి: ప్రతీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా దాచే సీక్రెట్స్!

ఇది కూడా చదవండి: అన్ని విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారో తెలుసా?

ఇది కూడా చదవండి: పెంపుడు కుక్క ఇష్టం లేదన్నాడని ... పెళ్ళి రద్దు చేసుకున్న యువతి

English summary

Baahubali buffalo in Uttar Pradesh. This Baahubali buffalo weight is 1 and half ton. And it is eating daily 20 liters milk and 20 kilograms apples. And also it is staying in air coolers room.