'బాహుబలి' ఓ చెత్త సినిమా: గుర్వీందర్ సింగ్

Baahubali is the worst film says punjabi film director

11:39 AM ON 1st April, 2016 By Mirchi Vilas

Baahubali is the worst film says punjabi film director

అందరూ వెళ్ళే దారిలో వెళ్తే ఏముంది మజాకా, విలక్షణంగా అందునా పూర్తి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అదే కోడి గుడ్డుకి ఈకలు లాగడం అనే సామెత ఉండనే ఉందిగా... ఇదంతా ఎందుకంటే, దేశవ్యాప్తంగా 'బాహుబలి' కలెక్షన్ల వర్షం కురిపించి తెలుగు వాడి సత్తాను చాటడమే కాదు ఈ సినిమా 63వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచిన బాహుబలికి ఆ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల తెలుగుజాతి అంతా గర్విస్తోంది. ఇక దక్షిణాది సినిమాకు అదీ ఓ తెలుగు సినిమాకు ఈ అవార్డ్ రావడం బయట రాష్ట్రాల వాళ్లకు ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ వాళ్లకు నచ్చలేదనే మాట వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: మరదలితో సహజీవనం, మరో మహిళతో శృంగారం

కేవలం ఒక పార్ట్ మాత్రమే రిలీజైన సినిమాకు నేషనల్ అవార్డ్ ఎలా ఇస్తారు అని, గ్రాఫిక్స్ తప్ప సినిమాలో ఏముంది అని రకరకాలుగా విమర్శిస్తున్నారు. కాగా పంజాబీ డైరెక్టర్ గుర్వీందర్ సింగ్ అయితే ఒకడుగు ముందుకు వేసి, జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన చెత్త ఫిల్మ్ 'బాహుబలి' అన్నాడు. అసలు దానికి అంత సీన్ లేదని అనేసాడు. అంతేకాదు తాను జాతీయ అవార్డులు ఎంపిక పట్ల చాలామంది నిరాశపడ్డానని అవార్డుల ఎంపిక సక్రమంగా లేదని మండిపడుతున్నాడు. గుర్వీందర్ సినిమా 'చౌతీ కూట్' రీజినల్ బెస్ట్ ఫిల్మ్ ఫర్ పంజాబీగా ఎంపికైనా, గుర్వీందర్ కు తృప్తి లేదు. నేనేకాదు ప్రతి వారూ..

ఇది కూడా చదవండి: బికినీలో హీటెక్కిస్తున్న 'సర్దార్' భామ..

బాహుబలికి అవార్డు దక్కడం పట్ల వ్యతిరేకిస్తున్నట్లు చెబ్తున్నాడు. కాగా బాహుబలి కు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్ రావడంతో చిత్ర యూనిట్ కృతజ్ఞత తెలుపుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

English summary

Baahubali is the worst film says punjabi film director. Punjabi film maker Gurvinder Singh said that Baahubali is the worst film.