'యూట్యూబ్'లో విడుదలవుతున్న బాహుబలి..

Baahubali movie is uploading tomorrow in youtube

12:30 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Baahubali movie is uploading tomorrow in youtube

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేసిన బాహుబలి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 10 న విడుదలకాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ ప్రశంసలు పొందింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్నాక తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో టివీల్లో కూడా ప్రదర్శితమై రెకార్డ్ టిఆర్‌పి రేటింగ్‌ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని రేపు సాయంత్రం తెలుగు, తమిళం, మలయాళ వర్సెన్‌లో పూర్తి సినిమాని యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

సాయంత్రం 6 గంటలకు 4కే రిసల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ వర్సెన్‌ యూట్యూబ్‌లో కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన తమన్నా, అనుష్క లు హీరోయిన్లుగా నటించినగా రానా ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీప్‌ వద్ద అలజడి సృష్టించిగా రేపు యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

English summary

Baahubali movie is uploading tomorrow evening 6 'O' clock in youtube. The movie is directed by S.S. Rajamouli.