బాహుబలి -2 పై తొలగిన ఊహాగానాలు..

Baahubali team revealed rumours on part 2

12:59 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Baahubali team revealed rumours on part 2

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్బుత దృశ్య కావ్యం బాహుబలి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందింది. అయితే బాహుబలి కి కొనసాగింపు బాహుబలి-2 పై చాలా రూమర్లు వచ్చాయి. బాహుబలి-2లో సూర్య, లావణ్య, శ్రియ సరన్ నటిస్తున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. అయితే వీటికి నిర్మాతలు స్పందిస్తూ బాహుబలి-2 కి కొత్త పాత్రలని ఏమి సృష్టించలేదు అని క్లారిటీగా చెప్పడంతో పుకార్లన్నీ తొలగిపోయాయి. కానీ బాహుబలి-2 కి ముందు రాసుకున్న కధను కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేశామని చెప్పారు. బాహుబలి మొదటి భాగం తీసినప్పుడే రెండో భాగం కూడా 40 శాతం ఘాటింగ్‌ పూర్తి చేశాం. డిసెంబర్‌ మొదటి వారం నుండి ఘాటింగ్‌ మొదలు పెట్టి 2016 సంవత్సరం ఆఖర్లో ఈ చాత్రాన్ని విడుదల చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పారు. అయితే పార్ట్-2 కి గ్రాఫిక్స్‌ ని ఇంకా అత్యున్నత పరిమాణాలతో తెరకెక్కించాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు.

English summary

Baahubali team revealed rumours on part 2 by producers sobhu.