కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘బాహుబలి’

Baahubali The Beginning in cannes film festival

10:11 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Baahubali The Beginning in cannes film festival

అందు లేడు ఇందు లేడు.... అన్న చందంగా అన్నింటా ‘బాహుబలి' దూసుకుపోతున్నాడు. తాజాగా కేన్స్‌ చిత్రోత్సవాల్లోనూ స్థానం సంపాదించుకొంది. 'ది బిగినింగ్‌’ జైత్రయాత్ర కొనసాగిస్తూ, బాక్సాఫీసు దగ్గర కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించింది. ‘బాహుబలి’, అంతర్జాతీయ వేదికల్లోనూ తన హవా చూపిస్తోంది. ఇప్పుడు కేన్స్‌ చిత్రోత్సవాల్లోనూ స్థానం సంపాదించుకొంది. ఈ నెలలో జరగనున్న అంతర్జాతీయ సినిమా పండుగలో ‘బాహుబలి’ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 16న రాత్రి 8.30 గంటలకు ‘బాహుబలి’ ని కేన్స్‌ వేడుకలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ హాజరుకానున్నారు.

అదే రోజు సాయంత్రం 4 గంటలకు ‘బాహుబలి’ చిత్రబృందం ఓ చర్చావేదికలోనూ పాల్గొనబోతోంది. ఈ కార్యక్రమాన్ని ‘బాహుబలి’ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చని అంటున్నారు. దేశంలో తొలిసారిగా: ‘బాహుబలి’ సినిమాకి సంబంధించి దర్శకుడు జక్కన్న వర్చువల్‌ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓ డాక్యుమెంటరీ రూపొందించే పనిలో ఉన్నాడట. ‘బాహుబలి’ మేకింగ్‌ విశేషాల్ని ఈ వీడియోలో పొందుపరుస్తారు. వర్చువల్‌ రియాలిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... తెర పై సన్నివేశం చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి అదంతా తన కళ్లముందే జరుగుతోందన్న అనుభూతి కలుగుతుంది.

ఒక విధంగా త్రీడీ వెర్షన్‌కి ఇది మరో ముందడుగన్న మాట. ఓ సినిమా పై వర్చువల్‌ రియాలిటీతో డాక్యుమెంటరీ రూపొందించడం భారతదేశంలోనే ఇదే తొలిసారి. మరి ఆ డాక్యుమెంటరీ నిడివి ఎంతో, ఎప్పుడు బయటకు వస్తుందో ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి బాహుబలి తన దూకుడు ఇంకా సాగిస్తూనే వున్నాడు.

English summary

Baahubali The Beginning in cannes film festival. Prabhas super hit movie Baahubali The Beginning in Cannes film festival.