'బాహుబలి' యుద్ధం గ్రాఫిక్స్‌ చేశారిలా!

Baahubali war sequence graphics video

03:29 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Baahubali war sequence graphics video

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మొదటిసారి ద్విపాత్రాభినియం చేసిన చిత్రం 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం 2015 జూలై 10న విడుదలై ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రభాస్‌ సరసన అనుష్క, తమన్నా కథానాయికలుగా నటించారు. ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి -2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఇంకా హై విజువల్‌ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నాడు. అయితే బాహుబలి -2 విడుదలవ్వడానికి ఇంకా దాదాపు సంవత్సరం అయినా పట్టొచ్చు. ఈ లోపు ఈ చిత్రం గురించి ప్రజలు చర్చించుకోవడం కోసం రాజమౌళి బాహుబలికి సంబంధించిన గ్రాఫిక్స్‌ వీడియోలు ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నారు.

మొన్న బుల్‌ ఫైట్‌ వీడియో విడుదల చేయగా లేటెస్ట్‌గా బాహుబలి వార్‌ సీక్వెన్స్‌ వీడియో విడుదల చేశారు. మీరు కూడా చూడండి.


English summary

Baahubali war sequence graphics video released today. The movie is directed by S.S. Rajamouli and the cast is Prabhas, Aunshka and Tamanna.