నేనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని

Baba Jai Guru Dev announced that i am Subhash Chandra Bose

11:40 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Baba Jai Guru Dev announced that i am Subhash Chandra Bose

మధురలో 260 ఎకరాల పార్కును ఆక్రమించుకున్న వారు తాము బాబా జై గురుదేవ్ అనుచరులమని అంటున్నారు కదా. ఈ బాబా ఓ స్వయంప్రకటిత దైవజనుడు. 116 ఏళ్ల వయసులో 2012లో మరణించాడని చెబుతారు. బాబా అనుచరులంతా కబ్జాకోర్లే. వారి సాయంతో ఢిల్లీ-మధుర హైవేపైన, ఇటావా జిల్లాలో పలు విలాసవంతమైన ఆశ్రమాలను బాబా నిర్మించారు. రూ.4 వేల కోట్ల విలువ చేసే భూములు ఆయనకున్నాయి. రూ.150 కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. ఆయన అనుచరులు లేదా భక్తులు రోజూ రూ.12 లక్షల వరకు విరాళాలు ఇస్తుంటారని అంటారు.

ఆయన బాల్యం గురించి ఎవరికీ సమాచారం లేదు. పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులను కోల్పోయాడని, ఏడేళ్ల వయసులోనే అసలైన ఆధ్యాత్మికవాదిని అన్వేషించేందుకు ఇల్లొదిలి పోయాడని, ఆలీగఢ్లో గురెలాల్ శర్మ అనే రుషిని కలిశాక అన్వేషణకు స్వస్తిపలికాడని ఓ కథ. అతి తక్కువ సమయంలో పలు ఆశ్రమాలు నిర్మించాడు. నేనే నేతాజీని అని ప్రకటించిన వైనం ఇది. అది 1975.. జనవరి 13. కాన్పూర్ నానా పార్క్లో ఓ ర్యాలీ జరగాల్సి ఉంది. ఆ ర్యాలీలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్వయంగా పాల్గొనాలి.

అప్పటికి 30 ఏళ్ల క్రితమే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని ప్రజలకు తెలుసు. అయినా ఆ నేతాజీ ఎవరో చూద్దామని పెద్దసంఖ్యలో జనం ఆ పార్కుకు వెళ్లారు. జై గురుదేవ్ వేదిక ఎక్కాడు. నేనే సుభాస్ చంద్రబో్సనని ప్రకటించాడు. అయితే ఆయన మరో మాట అనేలోపు కోపోద్రిక్తులైన జనం ఆయనపై చెప్పులు, రాళ్లు, కుళ్లిన గుడ్లు విసిరారు. బాబా జైగురుదేవ్ ఏకంగా దూరదర్శి పేరుతో పార్టీనే పెట్టాడు. 80, 90 దశకాల్లో పలు ఎన్నికల్లో పోటీచేసి, పరాజయం పాలయ్యాడు. ఇక కబ్జాకోరులైన బాబా అనుచరులపై యూపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మండలి 16 కేసులు నమోదుచేసింది.

తమ భూములు కబ్జా చేశారంటూ మధుర జిల్లా కలెక్టర్కు రైతుల నుంచి 23 ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు మళ్ళీ మధురలో గొడవ.

English summary

Baba Jai Guru Dev announced that i am Subhash Chandra Bose