పతకాల గురించి రామ్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Baba Ramdev About Olympic Medals

10:53 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Baba Ramdev About Olympic Medals

బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ వంటి ప్రకటనలకు కాలం చెల్లింది. ఇప్పుడు ఒలంపిక్స్ లోగానీ, మరో క్రీడా సంబరంలో గానీ పతకాలు గెలవాలంటే, తినాల్సినవి వేరే ఉన్నాయంట. ప్రస్తుతం ఈ అంశం పెద్ద రచ్చ అయింది. ఇంతకీ విషయం ఏమంటే, యోగా దగ్గర నుంచి ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా బాబా రాందేవ్ దగ్గర చాలా చిట్కాలే ఉన్నాయని అంటున్నారు. ఆయన దగ్గర ఇప్పటికే అవసరమైన ప్రోడక్ట్స్ ఉండనే ఉన్నాయి. ఒలంపిక్ గోల్డ్ మెడల్ రహస్యం తెలుసుంటే బాగుండునని ఎవరైనా అనుకుని ఉంటే ఆ సమాధానం కూడా రెడీగానే ఉంది. రాందేవ్ బాబా ఆ గుట్టు విప్పారు.'మీరు రియల్ ఛాంపియన్ కావాలంటే అందుకు తగిన పవర్ ఆవు నెయ్యి వల్లే వస్తుంది. గొడ్డు మాంసం తింటే కాదు' అని బాబా రాందేవ్ మంగళవారం నాడు ట్వీట్ చేశారు. గొడ్డు మాంసంపై బీజేపీ ఎంపీ డాక్టర్ ఉదిత్ రాజ్ సోమవారం సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో రాందేవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ గొడ్డుమాంసం తిని ఒలంపిక్స్ లో 9 స్వర్ణపతకాలు గెలుచుకున్నాడంటూ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రామ్ దేవ్ బాబా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:బాబుని నిద్రపోనివ్వనన్న ముద్రగడ(వీడియో)

ఇవి కూడా చదవండి:రూ. 5 వేల రేంజ్ లో కొనగలిగే 4జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!

English summary

World Famous Spiritual and Yoga teacher Baba Ramdev Made some controversial comments on Olympics. BJP MP Dr. Udit Raj said that Usain Bolt has won medals because of eating Beef and Baba Ramdev gave counter by saying that every Athlete have to eat Cow Ghee but not cow Flesh.