'గ్యారేజ్'లోకి 'బాబు బంగారం' - కర్చీఫ్ వేసిన సునీల్

Babu Bangaram and Eedu Gold Ehe movies is releasing in August

11:31 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Babu Bangaram and Eedu Gold Ehe movies is releasing in August

అనుకున్న ప్రకారం మూవీ విడుదల చేయాలని తపిస్తూ, హ్యాట్రిక్ హిట్ కు సిద్ధంగా ఉన్న యంగ్ టైగర్ 'జనతా గ్యారేజ్' ఆగష్టు నుంచి సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అవకాశం వస్తే వదలద్దురా అన్న చందంగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొంతమంది రెడీ అయిపోయారు. అదేరోజు మూవీ తెరపై పడాలని చాలామందే ఉవ్వీళ్లూరుతున్నారు. ముఖ్యంగా వెంకీ ఆగస్టు 12న బాబు బంగారంతో తెరమీదికి వచ్చేస్తున్నాడు. వెంకీ పక్కన నయనతార నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మాంచి క్రేజ్ తెచ్చేసుకుంది. ఆ బాబు 24 క్యారెట్ బంగారం.

మదర్ థెరిస్సా మళ్ళీ పుట్టి ఖాకీ కడితే ఎలా ఉంటుందో, మా బాబు అలా ఉంటాడు అని దర్శకుడు మారుతి తన మాటల్లో రాసిన మాటలు ఓ సారి గుర్తుతెచ్చుకుంటే తెలుస్తుంది. అన్నట్టు ఈ నెల 24న బాబు బంగారం పాటలు విడుదల మార్కెట్ లోకి రానున్నాయి. ఇక సునీల్ కూడా ఆగష్టు 12వ తేదీ పైనే కర్చీఫ్ వేసి కూర్చున్నాడట. ఈ నెల 29న 'జక్కన్న'గా అలరించనున్న సునీల్ ఆగస్టు 12న 'ఈడు గోల్డ్ ఎహే' అంటూ ప్రేక్షకులను మరోమారు పలకరించనున్నాడట. 'దూసుకెళ్తా' తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకున్న దర్శకుడు వీరూపోట్ల ఈ సినిమాని తెరకెక్కించారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రిచా పనాయ్, సుష్మా రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

English summary

Babu Bangaram and Eedu Gold Ehe movies is releasing in August