'బొబ్బిలి రాజా'లో డైలాగ్ ని గుర్తు చేసిన 'బాబు బంగారం' టీజర్

Babu Bangaram movie teaser

12:18 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Babu Bangaram movie teaser

దృశ్యం, గోపాల గోపాల వంటి చిత్రాలు తరువాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'బాబు బంగారం'. 'భలే భలే మగాడివోయ్' వంటి విజయంతో మంచి ఊపు మీదున్న మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎస్. నాగవంశీ, పిడివి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. జూలై 1న ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ చిత్రం టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో స్లిమ్ అండ్ సెక్సీగా నయనతార ఆకట్టుకోవడం ఒకెత్తయితే.. ఎసిపి కృష్ణ అంటూ మరోసారి ఖాకీ డ్రస్ వేసి ఒక మాస్ పోలీస్ గా వెంకీ హంగామా చేయడం మరో ఎత్తు.

లుక్స్ అండ్ డైలాగ్ టైమింగ్ అదిరిపోయాయ్. ముఖ్యంగా మరోసారి అయ్యో అయ్యో అయ్యయ్యో మాత్రం కేక అంతే. ఘిబ్రన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఈ టీజర్ చూస్తుంటే మారుతి మరో హిట్ కొట్టేసేలా ఉన్నాడు.

English summary

Babu Bangaram movie teaser