ఆ ఇంట 100 ఏళ్ళ తర్వాత పాపాయి పుట్టింది!

Baby Born After 100 Years In That Family in America

11:07 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Baby Born After 100 Years In That Family in America

అవును ఆ ఇంట్లో ఓ శతాబ్దం నుంచి అబ్బాయిలే పుడుతున్నారు. ఉన్నట్టుండి రాత మారింది. ఫలితంగా ఆ ఇంట్లో అమ్మాయి పుట్టడమే మహాద్భుతం గా భావిస్తున్న తరుణంలో శుభ ఘడియ రానే వచ్చింది. ఇంకేముంది.తమ కుటుంబంలో పాప పుట్టిందంటూ కుటుంబసభ్యులంతా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ కుటుంబంలో అస్సలు అమ్మాయి పుట్టడమే తెలియదు. అయిదా.. పదా.. ఏకంగా వందేళ్ల పాటు ఆ ఇంట్లో అంతా అబ్బాయిలే జన్మించారు. దాంతో వారు అమ్మాయి పుడుతుందని వూహించనే లేదట. ఎట్టకేలకు శతాబ్ద కాలానికి వారి కల నెరవేరింది. అమెరికాలోని ఇదాహో స్టేట్‌ పోస్ట్‌ ఫాల్స్‌ నగరంలోని ఓ కుటుంబం ఈ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంది. ఇంతకీ ఇది ఎక్కడంటే, పోస్ట్‌ఫాల్స్‌ నగరంలోని ఉందర్‌డాల్‌ కుటుంబంలో 1914వ సంవత్సరం నుంచి అస్సలు అమ్మాయిలు పుట్టలేదు. ఎట్టకేలకు 2016 ఏప్రిల్‌ 12న వారి కుటుంబంలో చిన్నారి పాప ఆరేలియా కేర్‌ మంది. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆరేలియా అమ్మ ఆష్టన్‌ ఉందర్‌డాల్‌ తనకు అమ్మాయి పుడుతుందని అసలు కలలో కూడా వూహించలేదట. చరిత్ర అలాంటిది మరి. వూహించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏదైతేనేం మొత్తానికి ఆ కుటుంబం కూడా చిన్నారి పాప ముద్దుముచ్చట్లతో కళకళలాడబోతోంది. ఆ ఇంట సంతోషాల హరివిల్లు విరిసింది.

ఇవి కూడా చదవండి:చ ... చ ..13ఏళ్ల బాలికలకు కన్యత్వ పరీక్షలు చేసి మరీ ...

ఇవి కూడా చదవండి:ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

English summary

A Girl Baby Born After 100 years in that Family History in America. From the year 1914 no Girl babies has born in that Family In America. Now the whole family were happy by seeing that Baby.